భోనం ఎత్తిన మార్కెట్ చైర్మన్ విమల

  • మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

మోత్కూరు, ఆంధ్రప్రభ: ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగలో మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా భోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు.

చైర్మన్ దంపతులు స్థానిక మైసమ్మ ఆలయంలో దేవతలకు బోనం నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వర్షాకాలంలో రైతులకు అన్ని రకాల పంటలు సమృద్ధిగా పండాలని, అధిక దిగుబడులు రావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చైర్మన్ విమల తెలిపారు.