ధర్మపురి ఎస్సైగా సధాకర్ బాధ్యతల స్వీకరణ

ధర్మపురి, ఆంధ్రప్రభ: ధర్మపురి పోలీస్ స్టేషన్ ఎస్సై (ఎస్‌హెచ్‌ఓ)గా నాగపురి సధాకర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్‌కు చెందిన సధాకర్ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల టౌన్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, కోరుట్ల తదితర పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు.

ఇటీవల జగిత్యాల టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న ఆయన ధర్మపురి ఎస్సైగా బదిలీపై వచ్చి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎస్సై సధాకర్ మాట్లాడుతూ.. ధర్మపురి పట్టణం, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు రక్షణ కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.