సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ట్రినిటీ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు, పోలీసులు సూచించారు. పెద్దపల్లి పట్టణం ఒకటో వార్డులో ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాలు, నకిలీ ఫోన్‌ కాల్స్‌, అనుమానాస్పద లింకులు, ఓటీపీ, బ్యాంకింగ్‌, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలపై ప్రజలకు వివరించారు.

అనుమానాస్పద లింకులు పంపినా, ఓటీపీ లేదా బ్యాంకు వివరాలు అడిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పూరేళ్ల శైలజ-సుధాకర్‌, సైబర్‌ నేరాల అవగాహన కార్యక్రమం ఇన్‌చార్జి అనిల్‌, కళాశాల అకాడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ అశోక్‌, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.