76. ముల్లునెప్పుడైన ముల్లు తోడనె తీయ
వలయునన్న మాట పచ్చినిజము
లోకతంత్రమెరిగి లోగుట్టు చూపించు
గీతదాత నీకు కేలుమోడ్తు
77. పూతనయిన ఆమె మాతయయినగాని
బాలకృష్ణుజంప ఏల జరుగు?
పాలనమున ఘనుని పాలిచ్చి చూపునా?
గీతదాత నీకు కేలుమోడ్తు
78. సృష్టిలోన గొప్పదృష్టి విశేషమ్ము
పరిణయమ్ముకొరు ప్రణయ లేఖ
అందుకొంటివీవు అనితర సాధ్యమౌ
గీతదాత నీకు కేలుమోడ్తు