ఇన్స్‌పెక్టర్ల బదిలీ

మల్టీ జోన్‌-1 పరిధిలో పలువురు సీఐలకు స్థానచలనం
ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మల్టీ జోన్‌-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వెయిటింగ్‌లో ఉన్న తేళ్లబోయిన కిరణ్‌ను సీఎస్‌బీ రామగుండంకు, సాట్ల రాజును భద్రాద్రి కొత్తగూడెం వీఆర్‌కు బదిలీ చేశారు.

పసుపులేటి బాలాజీ వరప్రసాద్‌ను సీసీఎస్‌ రామగుండంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న బాషెట్టి ప్రణయ్‌కుమార్‌ను ఆదిలాబాద్ ఉమెన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

హైదరాబాద్ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న బిల్ల వెంకటేశ్వర్లును ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఆదిలాబాద్ డీఎస్‌బీలో పనిచేస్తున్న దబ్బెట మోహన్‌ను సీసీఎస్‌ నిజామాబాద్‌కు బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.