శాకంబరి మహోత్సవంలో డీసీసీ అధ్యక్షురాలు

వాసవి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవి మహాసంస్థాన్ అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శాకంబరి మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

జోగిని నిషా క్రాంతి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, కోశాధికారి జూలకంటి మల్లేశం, అమేటి మహేందర్, నామ భాస్కర్, అమేటి భాస్కర్, తోపాజీ తేజ, తోపాజీ హరీష్, అక్షంతల కృష్ణవేణి, అమేటి రాణి, ఇల్లంతల ప్రసన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.