ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి
దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండలం వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి రాజన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు.
