మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు
సూర్యాపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తుది శ్వాస వరకు ఉద్యమించిన మహనీయుడు ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ అని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు కొనియాడారు. గురువారం సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని గణాంకాలు, చారిత్రక ఆధారాలతో దేశానికి వివరించి ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో అనేక తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, మాజీ ఎంపీపీ నేమ్మాది బిక్షం, మాజీ జడ్పీటీసీ జీడీ బిక్షం, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు తూడి నర్సింహారావు, అంగీరేకుల నాగార్జున, ఆకుల లవకుశ, తాహెర్ పాషా, అనిల్, జ్యోతి లింగా నాయక్, ముదిరెడ్డి అనీల్ రెడ్డి, ఆనంతుల విజయ్, మోత్కూరి సందీప్, రఫీ, శంకర్ నాయక్, అశోక్ నాయక్, సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
