బండి సంజయ్ ని కలిసిన ఆలేరు ఎన్నారై ప్రదీప్

ప్రదీప్ సేవా కార్యక్రమాలను తెలుసుకొని మంత్రి బండి సంజయ్ ప్రశంస

ఆలేరు,ఆంధ్రప్రభ: నైజీరియాలో ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థలో విధులను నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎన్నారై ప్రదీప్ బిరుకూరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను న్యూఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి సంజయ్ మాట్లాడుతూ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ముఖ్యంగా యువ ఎన్నారైలు సమాజ సేవలో భాగస్వాములవుతూ యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎన్నారై ప్రదీప్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని మంత్రి ప్రశంసించారు.