సార్ సేవలు చిరస్మరణీయం
మద్దిగట్లలో ఘనంగా జయశంకర్ సార్ జయంతి
భూత్పూర్, ఆంధ్రప్రభ : భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నట్టి సురేష్‌తో పాటు ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ నట్టి సురేష్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తినిస్తాయని, వాటిని ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, యువత, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
