జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జయశంకర్ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి
ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచన
పరకాల (ఆంధ్రప్రభ): పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రార్థనా సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి చిలువేరు సురేందర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిలువేరు సురేందర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించి, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
