మాజీ మంత్రి సీదిరికి మరో 14 రోజులు రిమాండ్
పలాస, ఆంధ్రప్రభ: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పారిశ్రామికవాడ ప్రాంతంలో గత నెల 10వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాద కేసులో ఎ3 ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీధిరి అప్పలరాజుకు పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి యు.మాధురి మరో 14 రోజులు రిమాండ్ విదించినట్లు అప్పలరాజు తరుపు న్యాయవాదులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి నేటితో గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ బుధవారం ముగియడంతో మాజీ మంత్రి అప్పలరాజును వర్షవల్ గా పోలీసులు హాజరు పరచగా న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంభందించి మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు ఇప్పటికే జిల్లా జైలులో 14 రోజులు ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంభందించి సొంపేట కోర్టులో నేడు కొత్తగా బెయిల్ పిటీషన్ను ఆయన తరుపు న్యాయవాది వరిశ బాలక్రిష్ణ వేయడంతో సొంపేట కోర్టు న్యాయమూర్తి గురువారం నాటికి వాయిదా వేసినట్లు తెలిసింది.
