తల్లి పాలే బిడ్డకు మొదటి టీకా..
- సీడీపీవో పుష్పలత
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తల్లిపాలు బిడ్డకు మొదటి టీకాలా పనిచేసి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ సీడీపీవో పుష్పలత అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుస్థిరమైన ఆరంభానికి తల్లిపాలు ప్రతీక అన్నారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల బాలింతలకు బ్రెస్ట్ కేన్సర్, గర్భాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రేమ్ చంద్, సెక్టార్ సూపర్ వైజర్లు మాధవి, శివకుమారి, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి దివ్యశ్రీ, ఇన్ చార్జి ఎంపీడీవో ఉషారాణి, అంగన్ వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…
పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ ఫర్హీన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా స్థానిక పీహెచ్ సీలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండేళ్ల వయసు వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.
చిన్నారులకు చెక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఇవ్వకుండా ఉండాలన్నారు. ఆహారంలో చిరుధాన్యాలు చేర్చడం ద్వారా పిల్లల ఎదుగుదల, పోషకాహారం, ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశు పోషణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నిమ్రా ఫార్మా ప్రతినిధులు, గోపి, విద్యార్థులు, పీహెచ్ సీ సిబ్బంది పాల్గొన్నారు.
