గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం

ఆగస్టు 7న మహబూబ్‌నగర్‌లో డెమో ఎంపికలు
జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ పోస్టుల భర్తీకి గిరిజన గురుకుల సంస్థ ప్రకటన

అచ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీటీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పార్ట్‌టైమ్ జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి డెమో నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి (ఆర్‌సీఓ) కార్యాలయం మంగళవారం వెల్లడించింది.

ఆగస్టు 7న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్ తిరుమల హిల్స్, అప్పన్నపల్లిలోని టీజీటीडబ్ల్యూఆర్ డిగ్రీ కళాశాల (మహిళలు) ప్రాంగణంలో డెమో ఎంపికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

జూనియర్ లెక్చరర్ పోస్టులకు తెలుగు, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. పీజీటీ పోస్టులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో, టీజీటీ పోస్టులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత తేదీ, సమయానికి అవసరమైన అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురుకుల సంస్థ అధికారులు కోరారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

  • కొండాపూర్ – 9440898336
  • జడ్చర్ల – 8333925369
  • అచ్చంపేట – 8333925372
  • మన్ననూర్ – 9490957314
  • కల్వకుర్తి – 9490959716