అమ్మవారికి బంగారు హారం విరాళం
- రూ 3.88 లక్షల విలువైన బంగారు హారం
- ఆలయ అధికారులకు హారం అందజేత..
- దాతలకు దర్శనం, ప్రసాదాలు
ఇంద్రకీలాద్రి , ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారికి కర్నూలు జిల్లా రామచంద్రారెడ్డి నగర్‌కు చెందిన దాతలు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి దంపతులు సుమారు రూ.3.88 లక్షల విలువైన బంగారు హారాన్ని భక్తిశ్రద్ధలతో విరాళంగా సమర్పించారు. ప్రధానాలయ సూపర్నెంట్ సత్యనారాయణ కలిసి దాతలు బంగారు హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
దాతకు అధికారుల అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందిస్తే ప్రధాన ఆలయ సూపర్నెంట్ డివివి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ మధులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
