ఘనంగా దివి సీమ గాంధీ జయంతి వేడుకలు..
శావల్యాపురం, ఆంధ్రప్రభ : జిల్లా గ్రంధాలయ కార్యదర్శి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన శావల్యాపురం శాఖ గ్రంథాలయంలో దివి సీమ గాంధీగా పిలువబడే మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలను గ్రంథాలయ అధికారి రావూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు అవనిగడ్డ ఎమ్మెల్యేగా, మంత్రిగా దివిసీమకు విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తుగానే దివిసీమ గాంధీగా పిలువబడ్డారని అన్నారు. కార్యక్రమంలో కె. శ్రీనివాస్ సింగ్, సనిశెట్టి లక్ష్మీనారాయణ, మద్దికుంట వీరాంజనేయులు, సనిశెట్టి వెంకట గురు వీరంజనేయులు పాల్గొన్నారు.
