ఘనంగా మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు..

నరసరావుపేట, ఆగస్టు 4, (ఆంధ్రప్రభ) : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు సందర్భంగా మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హలులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అద్దయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రామరావు,. టూరిజం అధికారి నాయుడమ్మ లు పాల్గొని వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.