గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవాలి…
రాప్తాడు, ఆగస్టు 4 (ఆంధ్రప్రభ) : చిన్నపిల్లలను తప్పనిసరిగా ఫ్రీ స్కూల్ లో చేర్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని సెక్టార్-1 లోని అంగన్వాడీ సెంటర్-4 నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవంను నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ టీచర్లు బాలింతలు గ్రామ మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్-4లో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ…. బిడ్డ పుట్టిన వెంటనే గంట లోపల తల్లి ముర్రుపాలు పట్టాలని ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకాలు అని, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని అన్నారు.
6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.ఏ ఇతర పాలు పట్టకూడదని తెలియజేశారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదన్నారు. గర్భవతులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సావిత్రి, విజయలక్ష్మి, లక్ష్మీదేవి, ముత్యాలమ్మ, భారతి, ఆయాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
