Gold Price Today, 04-08-2026- Digital Gold Price-Spot Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

Gold Price Today, 04-08-2026- Digital Gold Price-Spot Gold Price | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, బిజినెస్ ప్ర‌తినిధి : కొద్ది రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలకు ఎట్టకేలకు స్వల్పంగా త‌గ్గింది. ఆగస్టు 4న దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల‌కు రూ.220 తగ్గి రూ.1,44,000కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల‌కు రూ.200 తగ్గి రూ.1,32,000 వద్ద ధ‌ర ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌కు సిద్ధమవుతున్న కొనుగోలుదారులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా చెప్పొచ్చు.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధ‌ర‌లు పెరిగాయి. ఔన్స్ (31.10 గ్రాముల‌)కు 25.70 డాల‌ర్లు పెరిగి 4,060.24 డాల‌ర్ల ధ‌ర వ‌ద్ద ట్రేడ్ అవుతుంది. ఒక గ్రాము స్పాట్ బంగారంకు 0.80 డాల‌ర్లు పెరిగి 130.51 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది.

డిజిట‌ల్ బంగారం ధ‌ర 24 కే ధ‌రకు గ్రాముకు వంద రూపాయ‌లు పెరిగి రూ.14,795.60 వ‌ద్ద ట్రేడ్ అవుతుంది.

ఈ రోజు (ఆగ‌స్టు 4) ధ‌ర‌లు
24 కే ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌లు 1,44,000 రూపాయ‌లు
22కే ప‌ది గ్రాముల బంగారం ధ‌ర‌లు 1,32,000 రూపాయ‌లు
స్పాట్ బంగారం ధ‌ర‌లు ఒక గ్రాముకు 130.51 డాల‌ర్లు
స్పాట్ బంగారం ధ‌ర‌లు ఔన్స్ (31.10 గ్రాములు) 4,060.24

గత పది రోజుల ప్రయాణం ఎలా ఉంది?
జులై చివరి వారంలో బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులు చూశాయి. జులై 28న తగ్గిన ధరలు, జులై 30న ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 1 నుంచి వరుసగా స్థిరంగా కొనసాగి, ఆగస్టు 4న మరోసారి స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా చూస్తే, మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం ధరలు కొంత స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

తేదీ 24 క్యారెట్లు 22 క్యారెట్లు
ఆగస్టు 4, 2026 రూ.14,400 (-22) రూ.13,200 (-20)
ఆగస్టు 3, 2026 రూ.14,422 (0) రూ.13,220 (0)
ఆగస్టు 2, 2026 రూ.14,422 (0) రూ.13,220 (0)
ఆగస్టు 1, 2026 రూ.14,422 (-38) రూ.13,220 (-35)
జులై 31, 2026 రూ.14,460 (+27) రూ.13,255 (+25)
జులై 30, 2026 రూ.14,433 (+82) రూ.13,230 (+75)
జులై 29, 2026 రూ.14,351 (-66) రూ.13,155 (-60)
జులై 28, 2026 రూ.14,417 (-75) రూ.13,215 (-155)
జులై 27, 2026 రూ.14,492 (-1) రూ.13,370 (+85)
జులై 26, 2026 రూ.14,493 (0) రూ.13,285 (0)

డిజిటల్ గోల్డ్ బంగారం ధ‌ర‌లు…
ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ ధర గ్రాముకు సుమారు రూ.14,796గా ఉంది. నిన్న‌టితో పోలిస్తే గ్రాముకు వంద రూపాయ‌లు పెరిగింది.
24 క్యారెట్ల డిజిటల్ బంగారం ధరలు (గ్రాముకు)
తేదీ డిజిటల్ బంగారం ధర (24K)
ఆగస్టు 4, 2026 రూ.14,795.60
ఆగస్టు 3, 2026 రూ.14,696.41
ఆగస్టు 2, 2026 రూ.14,755.05
ఆగస్టు 1, 2026 రూ.14,755.05
జులై 31, 2026 రూ.14,719.70
జులై 30, 2026 రూ.14,921.84
జులై 29, 2026 రూ.14,794.33

ప్రధాన నగరాల్లో ప‌ది గ్రాముల బంగారం ధరలు (ఆగస్టు 4)
హైదరాబాద్: 24K – రూ.1,43,590 | 22K – రూ.1,31,624
చెన్నై: 24K – రూ.1,43,660 | 22K – రూ.1,31,688
బెంగళూరు: 24K – రూ.1,43,480 | 22K – రూ.1,31,523
ముంబై: 24K – రూ.1,43,360 | 22K – రూ.1,31,413
కొల్‌కతా: 24K – రూ.1,43,170 | 22K – రూ.1,31,239
న్యూఢిల్లీ: 24K – రూ.1,43,120 | 22K – రూ.1,31,193