AP Deputy CM | ఏపీ అభివృద్ధికి మోదీ అండ…

మోదీపై పవన్‌ ప్రశంసలు
భోగాపురంతో ఉత్తరాంధ్రకు కొత్త అధ్యాయం
ఏపీ అభివృద్ధికి మోదీ అండ
140 కోట్ల ఆశల్ని నెరవేరుస్తున్న మోదీ
వికసిత్‌ భారత్‌కు మోదీ మార్గదర్శి


AP Deputy CM | విజయనగరం, ఆంధ్రప్రభ: 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో వేగంగా నడిపిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ అని పవన్‌ కొనియాడారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు మోదీ అని ప్రశంసించారు. తనను విమర్శించిన వారిని కూడా క్షమించే గొప్ప గుణం ప్రధానికి ఉందని పేర్కొన్నారు.

తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేసిన పవన్‌ కల్యాణ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతోందన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని చెప్పారు. దేశ ప్రగతికి మౌలిక సదుపాయాల కల్పనే కీలకమని ప్రధాని మోదీ బాగా అర్థం చేసుకున్న నాయకుడని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్‌ మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.