పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం..

  • పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న
  • సీనియర్ కార్యకర్త కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
  • లంబాడిపేట శీతలమ్మవారి బోనాల ఉత్సవాలకు విరాళం
  • 46వ డివిజన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పశ్చిమ ఇన్‌చార్జి

మైలవరం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా మైలవరం నియోజకవర్గ స్థాయి పోటీలు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్‌ఎస్‌కే స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి జిల్లా జట్టు ఎంపికలకు మొత్తం 18 మంది అర్హత సాధించారు.

అండర్–17 కబడ్డీ విభాగంలో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపిక కాగా, అండర్–17 ఖోఖో విభాగంలో ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు జిల్లా స్థాయి ఎంపికలకు అర్హత పొందారు. అలాగే అండర్–17 వాలీబాల్ విభాగంలో ఒక బాలుడు, ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. మైలవరం నియోజకవర్గం తరఫున ఈ 18 మంది విద్యార్థులు జిల్లా జట్టు ఎంపికల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎంపికలకు అర్హత సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి మోహనరావు, కరస్పాండెంట్ జి. భావన, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాలకు, మైలవరం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయుల సేవలను వారు ప్రశంసించారు.