ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
భూపాలపల్లి జిల్లా పలిమేలనో రికార్డు స్థాయిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం
వాజేడు మాహాదేవ్పూర్ మండలాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
ఖరిప్ ఆశలు పదిలం
భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనులు నిలిచిన పనులు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోని ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో ఇవే అత్యధిక స్థాయిలో కురిసిన వర్షాలుగా చెప్పుకోవచ్చు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపుగా నెల 15 రోజులు గడుస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపివానులతో వాగులు వంకలు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి.
భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో రికార్డు స్థాయిలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో రికార్డు స్థాయిలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే మహాదేవపూర్ మండలంలో 13.2 సెంటీమీటర్లు, కాటారం మండలంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం, మలహర్ మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ములుగు జిల్లా వాజేడు మండలంలో 13.8 సెంటీమీటర్లు కన్నాయిగూడెం మండలం లో 12.6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. నుగూరు వెంకటాపూర్ మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
భూపాలపల్లి జిల్లాలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని ఉపరితల బొగ్గుగనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది భూపాలపల్లి తో పాటు తాడిచెర్ల ఉపరితల బొగ్గలలో ఉత్పత్తి నిలిచిపోవడంతో భారీ నష్టం వాటిని సింగరేణి చెప్తున్నారు.
అటవీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు
భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని అంతర్గత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే ములుగు జిల్లా వాజేడు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ చత్తీస్గఢ్ ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
