పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘ‌ట‌న‌

త‌ప్పిన పెను ప్ర‌మాదం
చాకచక్యంగా స్పందించిన ట్రాఫిక్ పోలీసులు
నిమిషాల్లో మంటలు అదుపులోకి..
ప్రయాణికులు సురక్షితం
ట్రాఫిక్ పునరుద్ధరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఓ కారులో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పిల్లర్ నంబర్–278 సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు క్షణాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. వారి వేగవంతమైన చర్యలతో కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, సమీపంలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. మంటలు పూర్తిగా ఆర్పిన అనంతరం ట్రాఫిక్‌ను త్వరగా పునరుద్ధరించడంతో వాహనాల రాకపోకలు సాధారణంగా కొనసాగాయి. కారు ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు, ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తితో స్పందించిన తీరు ఓ భారీ ప్రమాదాన్ని నివారించిందని స్థానికులు ప్రశంసించారు.