భారీ వర్షాలకు కుప్పకూలిన పాక.. పశువులకు గాయాలు

కడెం (ఆంధ్రప్రభ): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామపంచాయతీ పరిధి నర్సింగాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పశువుల పాక కుప్పకూలింది. గ్రామానికి చెందిన కందుల తిరుపతికి చెందిన పశువుల పాక ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో ఉన్న పశువులకు గాయాలయ్యాయి. ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్ వెంటనే స్పందించి స్థానిక గోపాలమిత్రకు సమాచారం అందించారు. గాయపడిన పశువులకు తక్షణమే వైద్య చికిత్స అందించారు. పశువుల పాక కోల్పోయిన రైతు కందుల తిరుపతికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సర్పంచ్ ప్రభుత్వాన్ని కోరారు.