రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కొండగట్టు లో చేపట్టిన గిరి ప్రదక్షణ

పాల్గొన్న విప్, చొప్పదండి ఎమ్మెల్యే
కాసేపట్లో కొండగట్టులో వరుణ యాగం

కొండగట్టు ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కొండగట్టు లో చేపట్టిన గిరి ప్రదక్షణ వర్షంలోనూ కొనసాగుతోంది. బుధవారం గిరి ప్రదక్షణలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎలినినో ప్రభావం తో వర్షాలు కురియక పోవడం తో గిరి ప్రదక్షణ చేపట్టారు. కాసేపట్లో కొండగట్టు అంజన్న దేవాలయంలో వరుణ యాగం నిర్వహించనున్నారు.