గురు పరంపరే భారతీయ సంస్కృతికి జీవనశక్తి

గురు పరంపరే భారతీయ సంస్కృతికి జీవనశక్తి

  • గురు పౌర్ణమి విశిష్టత – వ్యాస మహర్షికి నివాళి
  • భారతీయ ధర్మాలలో గురు తత్వానికి ఉన్న అత్యున్నత స్థానం
  • గురు-శిష్య పరంపరే సంస్కృతి పరిరక్షణకు మూలాధారం
  • నైతిక విలువల సంక్షోభంలో గురు మార్గదర్శకత్వం అవసరం
  • విశ్వగురువుగా భారత్ ఎదగాలంటే విలువలతో కూడిన విద్య అనివార్యం

గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః॥ గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః॥” ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అనేక నాగరికతలు పుట్టాయి, ఎదిగాయి, కనుమరుగయ్యాయి. కానీ వేల సంవ త్సరాలుగా భారతీయ సనాతన సంస్కృతి నిత్యనూతనంగా నిలిచి ఉండడానికి ఒక ప్రధాన కారణం గురుశిష్య పరంపర. ఈ పరంపరే భారతీయ జ్ఞానానికి, ధర్మానికి, సంస్కృతికి, జాతీయ చైతన్యానికి జీవనాడి. ఆ మహోన్నత గురు సంప్ర దాయాన్ని స్మరించుకునే పవిత్ర పర్వదినమే గురు పౌర్ణమి.

ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షిని స్మరిస్తూ దేశమంతా గురు పూజలు నిర్వహించడం భారతీయ సంప్రదాయానికి ప్రతీక. వేదాలను విభజించి, మహాభార తాన్ని రచించి, అష్టాదశ పురాణాలను ప్రపంచానికి అందిం చిన వేదవ్యాస మహర్షి భారత జ్ఞాన సంపదకు శాశ్వత దిక్సూచి. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

భారతీయ దర్శనంలో గురువు వ్యక్తిని సంస్కరించే మహాశక్తి. అజ్ఞానాన్ని తొలగించి ధర్మజీవనానికి నడిపించే మార్గదర్శి. అందుకే ఉపనిషత్తులు “ఆచార్య దేవో భవ” అని బోధించాయి. తల్లిదండ్రులు శరీరానికి జన్మనిస్తే, గురువు వ్యక్తిత్వానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి జన్మనిస్తాడు. భారతదేశం లోని నాలుగు ప్రాచీన ధార్మిక సంప్రదాయాలైన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ధర్మాలు అన్నీ గురు తత్వాన్ని అత్యున్నత స్థాయిలో ప్రతిష్ఠించాయి.

హిందూ ధర్మంలో గురువు పరబ్రహ్మ స్వరూపుడు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, గురుగీత గురువు మహి మను విస్తృతంగా వివరిస్తాయి. ఆదిశంకరాచార్యులు, శ్రీరా మానుజాచార్యులు, శ్రీమధ్వాచార్యులు, శ్రీరామకృష్ణ పరమ హంస, స్వామి వివేకానంద వంటి మహనీయులు గురుశిష్య పరంపర ద్వారా భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచా నికి పరిచయం చేశారు.

బౌద్ధ ధర్మంలో భగవాన్ గౌతమ బుద్ధుడు జగద్గురు. ఆయన బోధించిన కరుణ, అహింస, ప్రజ్ఞ, మధ్యమ మార్గం ప్రపంచ మానవాళికి శాశ్వత మార్గదర్శనం. గురువు జీవన విధానాన్ని మలిచే ఆచార్యుడు.

జైన ధర్మంలో తీర్థంకరులు, ముఖ్యంగా భగవాన్ మహా వీరుడు, అహింస, అపరిగ్రహం, సత్యం, సంయమనం వంటి విలువల ద్వారా మానవాళిని నడిపించారు. గురువు చూపిన మార్గమే మోక్షానికి ఆధారం అని జైన సంప్రదాయం విశ్వసిస్తుంది.

సిక్కు ధర్మంలో గురు నానక్ దేవ్ జీతో ప్రారంభమైన గురు పరంపర గురు గోబింద్ సింగ్ జీ వరకు ధర్మరక్షణ, సమానత్వం, సేవ, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. అనంతరం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ను శాశ్వత గురువుగా ప్రకటించడం గురు తత్వానికి అపూర్వ గౌరవం.

ఈ నాలుగు భారతీయ ధార్మిక సంప్రదాయాలు వేర్వేరు ఆచారాలను అనుసరించినప్పటికీ, ఒకే శాశ్వత సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. గురువు లేక జ్ఞానం లేదు.. జ్ఞానం లేక ధర్మం లేదు.. ధర్మం లేక సమాజానికి శాంతి, శ్రేయస్సు లభించవు.

నేడు ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా, మానవ విలువల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది. యువతలో దిశాహీనత పెరుగు తోంది. సంస్కారాల స్థానంలో వినిమయ సంస్కృతి, స్వార్థం, నైతిక విలువల క్షీణత కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భార తీయ గురు-శిష్య పరంపర మళ్లీ సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉంది.

విశ్వహిందూ పరిషత్ అభిప్రాయం ప్రకారం, సనాతన ధర్మ పరిరక్షణకు దేవాలయాల నిర్మాణం ఎంత అవసరమో, గురు పరంపర పరిరక్షణ అంతకంటే అవసరం. ధర్మాన్ని కాపాడేది శాస్త్రం.. శాస్త్రాన్ని బోధించేది గురువు.. గురువులను గౌరవించే సమాజమే శాశ్వతంగా నిలుస్తుంది.

అందువల్ల ప్రతి హిందూ కుటుంబంలో పిల్లలకు గురు వుల పట్ల గౌరవం, భారతీయ సంస్కృతి, శాస్త్రాలు, ఇతిహా సాలు, మహనీయుల జీవితం పరిచయం చేయడం కాలాను గుణ ధర్మబాధ్యత. భారతదేశం ప్రపంచానికి “విశ్వగురు“గా నిలవాలంటే కేవలం ఆర్థిక లేదా సాంకేతిక శక్తి సరిపోదు. విలు వలతో కూడిన విద్య, ధర్మబద్ధమైన జీవనం, గురు-శిష్య సంప్రదాయం పునరుజ్జీవనం అనివార్యం. గురువులను గౌర వించే సమాజంలోనే సంస్కారం, సేవాభావం, దేశభక్తి, సామాజిక సమరసత వికసిస్తాయి. ఈ గురు పౌర్ణమి సంద ర్భంగా ప్రతి హిందూ కుటుంబం తమ జీవితాన్ని ప్రభావితం చేసిన గురువులను స్మరించాలి. పిల్లలకు భారతీయ గురు పరంపర గొప్పతనాన్ని పరిచయం చేయాలి. ధర్మాచరణను కుటుంబ సంస్కృతిగా మలచాలి. సమాజంలో సద్గుణాలు, సేవ, సంస్కారాల వికాసానికి కృషి చేయాలి.

గురువు పట్ల కృతజ్ఞతే భారతీయత. గురువు బోధించిన ధర్మాన్ని ఆచరించడమే నిజమైన గురుదక్షిణ. గురు పరంప రను పరిరక్షించడమే సనాతన సంస్కృతికి మనం అందించే గొప్ప సేవ. గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురువులందరికీ, దేశ ధర్మాన్ని, సంస్కృతిని, జాతీయ చైతన్యాన్ని తరతరాలకు అందించిన ఋషులు, ఆచార్యులు, సంత్ మహనీయులంద రికీ శతకోటి ప్రణామాలు. వారి ఆశీస్సులతో “ధర్మో రక్షతి రక్షితః” అనే శాశ్వత సందేశం ప్రతి భారతీయుని జీవితంలో సాకారం కావాలని ఆకాం పగుడాకుల బాలస్వామి క్షిద్దాం.