Terrible incident | కుటుంబ కలహాలే కారణమా..?

Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డలో కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్త కత్తితో హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో నివసిస్తున్న పుష్ప (30)ను ఆమె భర్త చెన్నయ్య గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ విభేదాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన అనంతరం నిందితుడు చెన్నయ్య పరారీలోకి వెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
