జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య

మొక్కను అందజేసి శుభాకాంక్షలు.. నగర పరిపాలనపై సంక్షిప్త చర్చ

ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్ మంగళవారం ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మొక్కను అందజేసి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పరస్పరం పరిచయాలు చేసుకుంటూ నగర పరిపాలన, ప్రజా సేవలకు సంబంధించిన పలు అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు.