నేరెళ్లకు కవిత.. గంధం గోపాల్ కుటుంబానికి పరామర్శ

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లకు చెందిన బాధితుడు స్వర్గీయ గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి నేరెళ్లకు బయలుదేరారు. నేరెళ్లలో గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించి, వారికి పార్టీ తరఫున అండగా ఉంటామని కవిత హామీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.