కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: బత్తుల కామేశ్వరి

విజయవాడ (పాయకాపురం), ఆంధ్ర‌ప్ర‌భ: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కాశీ విశ్వేశ్వర దేవస్థానం డైరెక్టర్ బత్తుల కామేశ్వరి – కొండా దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కూటమి పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞులైన పాలన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్‌ల పటిష్టమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కొనియాడారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.