నీరుకొండ సుబ్బారావుకు ఉత్తమ కార్యకర్త అవార్డు

కంకిపాడు, ఆంధ్రప్రభ: మండల కేంద్రం కంకిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ 185వ బూత్ కన్వీనర్ నీరుకొండ సుబ్బారావుకు పార్టీ సేవలకు గుర్తింపుగా ఉత్తమ కార్యకర్త అవార్డు లభించింది.

సోమవారం కంకిపాడు పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చేతుల మీదుగా సుబ్బారావు ఈ అవార్డును అందుకున్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న సేవలను గుర్తిస్తూ పలువురు కార్యకర్తలకు ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్త అవార్డులను ప్రదానం చేశారు.

అవార్డు అందుకున్న నీరుకొండ సుబ్బారావును పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.