సర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి

కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ పట్టణంలో కొనసాగుతున్న సర్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సూచించారు. టీపీసీసీ డెలిగేట్ లక్ష్మారెడ్డితో కలిసి కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ఆమె, సంబంధిత బృందాలు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.