నిరుపేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వ విప్

చిట్యాల, ఆంధ్రప్రభ: కష్టపడి, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మిర్యాల దీపిక కుటుంబం కళాశాల ఫీజు చెల్లింపులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక మాజీ కౌన్సిలర్, కో-ఆప్షన్ సభ్యుడు బెల్లీ సత్తయ్య యాదవ్ ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు.

విద్యార్థిని తండ్రి మిర్యాల నరేష్ కుమార్‌కు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి, దీపిక ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.