Lokesh-Meets-Pawan : పవనన్నకు లోకేష్ పరామర్శ
Lokesh-Meets-Pawan : పవనన్నకు లోకేష్ పరామర్శ
- హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం ఇంటికి లోకేష్ రాక
- ఇద్దరూ గాఢ ఆలింగనం
- ఆరోగ్యంపై మంత్రి ఆరా
(ఆంధ్రప్రభ, హైదరాబాద్ )

Lokesh-Meets-Pawan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిసి… డిప్యూటీ సీఎం ఆరోగ్యం స్థితిని అడిగి తెలుసుకున్నారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం విధితమే.

హైదరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసు కుంటున్న డిప్యూటీ సీఎంను శనివారం సాయంత్రం మంత్రి లోకేష్ కలిశారు. ఆప్యాయంగా సవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
