జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో వృత్తినైపుణ్య శిక్షణ తరగతుల ప్రారంభం…
కాజీపేట ఆంధ్ర ప్రభ… జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో వృత్తినైపుణ్య శిక్షణ తరగతుల కళాశాల ప్రిన్సిపల్ వి. రాధిక ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జనశిక్షణ సంస్థ డైరెక్టర్ కాజా మొజీయుద్దీన్ మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు రకాల వృత్తినైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, రిటైల్ క్యాషియర్, యోగ హెల్త్ కేర్ సంబంధిత కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు . ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, డాక్టర్ తిరుపతి నాయక్, సుజిత్, ప్రోగ్రాం కన్వీనర్, డాక్టర్ పి వీణ, రిసోర్స్ పర్సన్స్ అర్షియా, సుష్మ, మానస, కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
