వర్షాల కోసం కోటొక్క లింగానికి అభిషేకం
కొలనుపాక సోమేశ్వరాలయంలో మహిళల ప్రత్యేక పూజలు..
సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థనలు
ఆలేరు, ఆంధ్రప్రభ: సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ చండికా సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కోటొక్క లింగానికి శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగి, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ఈ ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి.
