బాధిత కుటుంబాలకు భరోసా.. సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ
పాయకాపురం, ఆంధ్రప్రభ: స్థానిక 58వ డివిజన్‌కు చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ. 8 లక్షల సీఎం రిలీఫ్ నగదు చెక్కులను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గురువారం టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ హయాంలోని 24 నెలల్లో సుమారు రూ.12 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధిని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందించినట్లు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కూడా సుమారు రూ.30 కోట్ల సీఎం రిలీఫ్ నిధిని ప్రజలకు అందించి రాష్ట్రంలోనే అత్యధికంగా సహాయం అందించిన ఎమ్మెల్యేగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.
