State Governor | డిప్యూటీ సీఎం ఆరోగ్యంపై గవర్నర్ ఆరా
State Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలని సూచిస్తూ, త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

పరామర్శ అనంతరం గవర్నర్ పవన్ కల్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని సందర్శించారు. అక్కడ ఉన్న పలు పుస్తకాలను పరిశీలిస్తూ రచయితలు, పరిశోధకులు, ప్రజా విధాన నిపుణులు రచించిన గ్రంథాలపై పవన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకు ఓ పుస్తకంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు. తన నివాసానికి వచ్చి ఆప్యాయంగా పరామర్శించిన గవర్నర్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
