బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఇల్లెందు (ఆంధ్రప్రభ): సీతారామ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న మంత్రివర్గ బృందాన్ని అడ్డుకునేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత దిండిగల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసినది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్న ఆయన, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అరెస్టయిన వారిలో రంగనాథ్, జబ్బార్, నభి, నాగేందర్, సిలివేరు సత్యనారాయణ, హరికృష్ణ, శీలం రమేష్, పూదూరి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
