పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
అవనిగడ్డ (ఆంధ్రప్రభ): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బుధవారం అవనిగడ్డలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ భుజం శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
