పుట్టినరోజు వేడుకలో చిన్నారులకు విద్యా కానుక

పుత్తూరు (ఆంధ్రప్రభ): పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాన్ని ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ చిన్నారుల విద్యకు చేయూతనిచ్చి నేసనూరుకు చెందిన పల్లూరు ధనుంజయులు, శశిరేఖ దంపతులు ఆదర్శంగా నిలిచారు. పుత్తూరు మండలంలోని నేసనూరు మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ధనుంజయులు పుట్టినరోజు, దంపతుల పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా 72 మంది విద్యార్థులకు పలకలు, రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎ. నరసింహులు మాట్లాడుతూ, తమ ఆనందకరమైన సందర్భాలను విద్యార్థులతో పంచుకుంటూ వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే సమాజాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్‌కుమార్, చెంచుకృష్ణ, ధనంజయన్, రాధ, అంగన్‌వాడీ టీచర్ ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.