బాధితులకు న్యాయం చేయాలి

  • ముఖ్యమంత్రికి వినతి పత్రం
  • నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఒగ్గు పర్వతాలు

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలోని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ మోసాలకు గురైన బాధితుల పక్షాన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవితో కలిసి ఒగ్గు పర్వతాలు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి బాధితుల సమస్యలను, జరిగిన మోసాల వివరాలను వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మోసాలకు పాల్పడిన వారి ఆస్తులు, భూములను వెంటనే జప్తు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యంగా పేద రైతులు,సామాన్య ప్రజలు తమ జీవితకాల డబ్బులను కోల్పోయినందున ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా.మల్లు రవి పాల్గొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఒగ్గు పర్వతాలు స్పష్టం చేశారు.