NEWS@3:00 P.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు
The Odyssey | ‘ది ఒడిస్సీ’పై భారీ అంచనాలు.. తెలుగు రాష్ట్రాల్లో హౌస్ఫుల్ ఓపెనింగ్స్
The Odyssey | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. విడుదలకు ముందే ఈ సినిమాపై అసాధారణ క్రేజ్ ఏర్పడగా, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే పలు ప్రాంతాల్లో ఓపెనింగ్ షోలు బుక్ అయిపోయాయి. నోలన్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులతో పాటు పురాణ, చారిత్రక కథలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. click here to read full news
Breaking | గూడ్స్ కింద పడి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండలో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. click here to read full news
Pralay | రణ్వీర్ నుంచి మరో భారీ సినిమా..
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: ధురంధర్ తరువాత బాలీవుడ్ రణ్వీర్ సింగ్ తిరుగులేని హీరోగా మారిపోయాడు. ఇప్పుడు వరుస సినిమాలతో రణవీర్ సింగ్ బిజీగా అయ్యాడు. ధురంధర్ తరువాత రణ్వీర్ చేయాబోయే సినిమాపైనే అందరి దృష్టి. ఆయన నటించనున్న కొత్త చిత్రం ‘ప్రళయ్’ పై ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బీ టౌన్ లో చక్కర్లు కొడుతుంది. click here to read full news
AP | ఓటర్లకు కీలక అప్డేట్…
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగిస్తూ తాజా షెడ్యూల్ను వెల్లడించింది. ఏపీలో SIR గడువు ఈ నెల 24 వరకు పొడిగించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు జూలై 31 వరకు గడువు పొడిగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అదే రోజు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. click here to read full news
కాంగ్రెస్ పాలనలో హోల్ సేల్ గా దోపిడీ
గోదావరిఖని, (ఆంధ్రప్రభ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని వనరుల దోపిడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హోల్సేల్ గా దుకాణాలు తెరిచారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని గోదావరిఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సందర్శించారు. click here to read full news
3-Cases-One-Day : ఠాణా హైరానా Andhra Prbha Ctime Analysis
( పల్నాడు ప్రతినిధి , ఆంధ్రప్రభ) పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణం నేడు పలు సంఘటనలకు నిలయంగా మారింది… ఏ సంఘటన జరిగిన సత్తెనపల్లి కేంద్రంగా జరగడం తో స్థానికులు ఖంగు తింటున్నారు… మరోవైపు జరుగుతున్న ఘటనా స్థలాలకు పోలీసులు పరుగులు పెడుతున్నారు…. ఈ సంఘటనలు సత్తెనపల్లి పట్టణ పరిసర ప్రాంతాలలో జరగడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది…! ఇక వివరాల్లోకి వెళితే… click here to read full news
Breaking news | జూ.ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ…
Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడం, కార్యక్రమాలు నిర్వహించడంపై ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) సంస్థకు ఎలాంటి అధికారం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కీలక వివరణ ఇచ్చింది. click here to read full news
Suryapet Farmers Protest | సూర్యాపేట రైతుల నిరసన వైరల్
Suryapet Farmers Protest | సూర్యాపేట, ఆంధ్రప్రభ : పొలానికి నీళ్లు కావాలి.. పంటను బతికించుకోవాలి.. రైతు అడిగేది అదే. కానీ తెలంగాణలో సాగునీటి అంశంపై మొదలైన రాజకీయ మాటల యుద్ధం ఇప్పుడు సూర్యాపేట జిల్లా రైతుల రక్తంతో నిరసన తెలిపే స్థాయికి చేరింది. click here to read full news
Gold Price Today-14 uly 2026- Rs.3930 down-Gold Market Update | పసిడి ధర మళ్లీ తగ్గింది.. పది రోజుల్లో రూ.3,930 పతనం.. నేటి బంగారం ధరలు ఇవే
Gold Price Today-14 uly 2026- Rs.3930 down-Gold Market Update |ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగినా, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. జూలై 14న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గి రూ.1,42,800కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,30,900 వద్ద ట్రేడవుతోంది. click here to read full news
