Nallagonda | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

Nallagonda | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి చేస్తానని నల్లగొండ మండలం దండేపల్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లెబోయిన బుచ్చిరాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానని, డ్రైనేజీలు, రోడ్లు సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
