ఏబీవీపీ పిలుపుతో విజయవంతమైన కళాశాలల బంద్
చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం చిట్యాల మండలంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైందని నగర కార్యదర్శి ముష్కే అజయ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.
విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వెంటనే రూ.10 వేల కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బుర్ర అభిజ్ఞ గౌడ్, వితేష్, అభిరామ్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
