క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

రఘునాథపల్లి (ఆంధ్రప్రభ): జనగామ జిల్లా కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్ నానమ్మ మరణించిన నేపథ్యంలో మంగళవారం పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జడ్పీటీసీ లింగాల జగదీష్ చందర్ రెడ్డి, రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్, జిల్లా యువజన నాయకుడు లోనే శ్రవణ్, గ్రామ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ తదితరులు మృతురాలి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.