బండారు యాదగిరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సన్మానం

  • రెండోసారి ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు
  • పలువురు బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరిని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంగారెడ్డి జిల్లా మహాసభ, నూతన కార్యవర్గ ఎన్నికల వివరాలను నాయకులు హరీశ్‌రావుకు వివరించారు.

అనంతరం బండారు యాదగిరిని అభినందించిన హరీశ్‌రావు, రెండోసారి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా శాలువా కప్పి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మల్కాపురం శివకుమార్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ నేత మామిండ్ల రాజేందర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, చింతా సాయినాథ్, గోవర్ధన్ నాయక్, జీవీ శ్రీనివాస్, షేక్ సాబేర్, శ్రీధర్‌రెడ్డి, మల్లగౌడ్ తదితరులు పాల్గొని బండారు యాదగిరికి శుభాకాంక్షలు తెలిపారు.