- రూ.12 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జానయ్య
- కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ రెవెన్యూ అధికారి మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన సంఘటన మంగళవారం మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది. మెదక్ మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న జానయ్య ఇంటి మ్యుటేషన్ కోసం బాధితుడి నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
