రేపు కోనసీమలో సీఎం చంద్రబాబు..
- ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల పనులకు శ్రీకారం..
- పిచ్చుకులంకలో రైతులతో ముఖాముఖి…
- పోలవరం ప్రాజెక్టు సందర్శన..
ఆంధ్రప్రభ, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, పోలవరం నిర్మాణ పురోగతిపై కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వేమగిరి చేరుకోనున్న ముఖ్యమంత్రి, ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 11:45 గంటలకు పిచ్చుకులంకలో రైతులతో సమావేశమై వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ చర్యలపై చర్చించనున్నారు.
రైతులతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ప్రాజెక్టు అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై పెండింగ్ పనులు, నిర్మాణ వేగవంతంపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
