పశ్చిమాసియాలో యుద్ధ విలయం.. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు
పశ్చిమాసియాలో యుద్ధ విలయం.. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల దాడి
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
భారతీయులకు కేంద్రం కీలక అడ్వయిజరీ
దాడులు ఆపాలని ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. ఇది ఏప్రిల్ నెలలో ‘కాల్పుల విరమణ తర్వాత మొదటిసారి ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్లోని నెవాటివ్, టెల్ నోఫ్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇరాన్ విప్లవ గార్డ్స్ ప్రకటించింది. ఇది బీరుట్లో ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా జరిగింది. అనేక మిస్సైల్స్ను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పింది. ఎటు వంటి ప్రాణ నష్టం లేదని తెలిపింది. ఇందుకు ప్రతిగా ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసింది. ఇరాన్లోని మహ్హహర్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లోని అనేక లక్ష్యాలను పేల్చివేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ దాడిలో ప్లాంట్ భాగాలు దెబ్బతిన్నాయని ఇరాన్ అధికారులు చెప్పారు. ఈ కాంప్లెక్స్ ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తికి కీలకమైనది. ఇతర సైనిక లక్ష్యాలపై కూడా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిసింది. టెహ్రాన్, ఇస్పహాన్, తబ్రిజ్ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్కు సంబంధించి కొత్త ప్రయాణ హెచ్చరికను భారతదేశం జారీ చేసింది. ఇరాన్లోని భారతీయ పౌరులందరూ వెంటనే దేశం వదిలి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఈ సలహాను ఇచ్చింది. భారతీయులు ఇరాన్కు ఎయిర్ లేదా ల్యాండ్ మార్గం ద్వారా ప్రయాణం చేయవద్దని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులందరూ అందుబాటులో ఉన్న ఏ వాహనాల ద్వారైనా దేశం నుంచి నిష్క్రమించాలని సూచించింది. రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని నియమిత సరిహద్దు మార్గాల ద్వారా వెళ్లాలని తెలిపింది. ఈ హెచ్చరిక ఇంతకు ముందు జారీ చేసిన సలహాలను ప ఎనరుద్ఘాటిస్తుంది.
దాడులు ఆపేశాం: ఇరాన్
ఇజ్రాయెల్పై సైనిక చర్యలను నిలిపివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్పై మరింత శక్తివంతమైన, బాధా కరమైన దాడులు జరుపుతామ ని ఇరాన్ సైనిక అధికారులు స్పష్టం చేశారు. లెబనాన్ ఇజ్రాయెల్ దాడులు శాంతి చర్చలను ప్రభావితం చేస్తున్నాయని ఇరాన్ చెప్పింది. లెబనాన్లోని తన మద్దతుదారులను రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ స్పష్టం చేసింది.
దాడులు ఆపండి: ట్రంప్
వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు.
